ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో.. వ్యాక్సిన్’ స్లాట్ బుకింగ్

by Sujitha Rachapalli |
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో.. వ్యాక్సిన్’ స్లాట్ బుకింగ్
X

దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ వల్ల దేశంలో చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కంపెనీలు తమ వినియోగదారులకు కొవిడ్ -19 సందేహాలను, వారి సమస్యలను పరిష్కరించి.. తగిన రీసోర్స్ పొందటానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో మొబైల్ కంపెనీ ఎయిర్‌‌‌‌టెల్ కూడా తమ కస్టమర్స్‌కు వ్యాక్సిన్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం ‘ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌’లోని ఎక్స్‌ప్లోర్ విభాగంలో రెండు కొత్త సబ్ సెక్షన్స్(ఉప విభాగాలను) జోడించినట్లు కంపెనీ ప్రకటించింది. మొదటి ఉప విభాగాన్ని ‘కోవిడ్ ఎస్‌వోఎస్’ కాగా, ఈ విభాగం మందులు, ఆక్సిజన్, ప్లాస్మా దాతలు, అంబులెన్సులు, హాస్పిటల్ బెడ్స్, కొవిడ్ పరీక్షా కేంద్రాలు వంటి ముఖ్యమైన వాటిని చూపిస్తుంది. ఈ ఫీచర్ క్లౌడ్-బేస్డ్ కమ్యూనికేషన్ సూట్ ‘ఎయిర్‌టెల్ ఐక్యూ’ ఆధారంగా పనిచేస్తుంది. ఈ విభాగంలో అందించిన సమాచారం కంపెనీ బృందాలు ధ్రువీకరించి ఆమోదం తెలుపుతాయి.

రెండవ ఉపవిభాగం ‘కోవిన్’ కాగా.. ఇది ఎయిర్‌టెల్ వినియోగదారులకు టీకా కేంద్రంలో స్లాట్‌ను కనుగొని మీతో పాటు, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం కూడా స్లాట్ బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. రియల్ టైమ్ ప్రాతిపదికన సమాచారాన్ని పొందడానికి ప్రభుత్వ కొవిన్ ప్లాట్‌ఫాం API లను ఎయిర్‌టెల్ థాంక్స్ అనువర్తనంతో అనుసంధానించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

వీటితో పాటు, కంపెనీ తన బిజినెస్ యూజర్స్ కోసం కూడా కొవిడ్ -19 వనరులను విడుదల చేసింది. ఎయిర్‌టెల్ ఐక్యూతో తమ ఉద్యోగుల కోసం వ్యాపారులు ఉచిత కొవిడ్ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. ప్రతి హెల్ప్‌లైన్ ఖాతాతో కంపెనీ 5,000 నిమిషాలు ఉచితంగా అందిస్తొంది. దాంతో వ్యాపారాలు తమ ఉద్యోగులతో కనెక్ట్ అయ్యే అవకాశముందని ఎయిర్‌టెల్ భావిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed