- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండిగో 'డోర్-టూ-డోర్ లగేజ్ డెలివరీ' సేవలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమాన ప్రయాణీకుల కోసం కొత్త సేవలను ప్రారంభించింది. విమానాశ్రయం నుంచి ఇంటికి, లేదా ఇంటి నుంచి విమానాశ్రయానికి ప్రయాణికుల లగేజ్‌ను తీసుకెళ్లే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘డోర్-టూ-డోర్ లగేజ్ డెలివరీ’ పేరుతో ఈ సేవలను అందించనున్నట్టు సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ విధమైన సేవలను హైదరాబాద్, ఢిల్లీలో మాత్రమే మొదలుపట్టామని, మరికొద్దిరోజుల్లో బెంగళూరు, ముంబైలలో కూడా ఈ సేవలను అందించనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రముఖ లాజిస్టిక్ సేవల కంపెనీ కార్టర్ పోర్టర్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ సేవలను ఇండిగో ప్రవేశపెట్టింది.
దీనిద్వారా ప్రయాణికుల లగేజ్ బ్యాగులను సురక్షితంగా వారి గమ్యానికి చేరవేస్తామని, ఇందులో లగేజ్‌ను ట్రాక్ చేసే సదుపాయాలు కూడా ఉంటాయని ఇండిగో స్పష్టం చేసింది. విమానం టేకాఫ్‌కు 24 గంటల ముందు గానీ, విమానం దిగిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ సేవలను పొందే వీలుంటుందని ప్రకటించింది. ఈ ‘డోర్-టూ-డోర్ లగేజ్ డెలివరీ’ సేవలకు రూ. 630(ఒక డెలివరీ) ధరను నిర్ణయించినట్టు ఇండియో తెలిపింది. అంతేకాకుండా లగేజ్‌కు రూ. 5 వేలతో సర్వీస్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.