- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కన్నడలో ఈమెయిల్ సర్వీస్
దిశ, వెబ్‌డెస్క్ :
ఒకప్పటి ఉత్తరానికి డిజిటల్ రూపునిస్తే.. ఈ మెయిల్ అయ్యింది. అయితే, ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేయాలంటే.. ఇంగ్లీష్ భాషలోనే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంగ్లిష్ రానివాళ్ల పరిస్థితేంటి? వారికోసమే జైపూర్‌కు చెందిన ఐటీ సంస్థ అయిన డేటా ఎక్స్‌జెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. రీజనల్ లాంగ్వేజెస్‌లో ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పటికే 21 నాన్ ఇంగ్లీష్ భాషల్లో ఈ సౌలభ్యం తీసుకొచ్చింది. తాజాగా కన్నడ భాషలోనే ఈమెయిల్ క్రియేట్ చేసుకునే అవకాశం తీసుకొచ్చింది.
భారతదేశంలో 89శాతం మంది ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల్లో మాట్లాడతారు. అందువల్లే.. నేటి ట్రెండింగ్ యాప్స్ చూసుకుంటే, లోకల్ లాంగ్వేజ్‌కు నెటిజన్లు పట్టం కడుతున్నారు. చాలామంది నెటిజన్లు తమ స్థానిక భాషలో చాట్ చేసుకునేందుకు, చదివేందుకు, విజ్ఞానాన్ని పొందేందుకు ఇష్టపడతారు. అందుకోసం మెయిల్ కూడా తమ లాంగ్వేజ్‌లో ఉంటే.. చదవడానికి, పంపించడానికి ఈజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ‘ఎక్స్ జెన్’ ఈ సౌకర్యాన్ని నెటిజన్లకు అందిస్తోంది. ప్రస్తుతం కన్నడ భాషాభిమానులకు కన్నడలో మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునేందుకు.. ఉచితంగా కన్నడ ఈమెయిల్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం ‘డేటా మెయిల్’లో క్రియేట్ చేసుకోవాలి. భారత్‌లో కన్నడ మాట్లాడేవారు 4.89 కోట్ల మంది ఉన్నారు.