- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టు నుంచి సెలవు రోజుల్లో కూడా ఎన్ఏసీహెచ్ విధానం అమలు
దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారుల సేవలను మరింత బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) ఆగస్టు 1 నుంచి ఆదివారం సహా అన్నిరోజుల్లో అందుబాటులో ఉండనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు బ్యాకుల పనిదినాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆర్‌బీఐ విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ విధానం ద్వారా వేతనాలు, పింఛన్, డివిడెండ్, వడ్డీలు ఇలా అన్ని రకాల చెల్లింపులను ఎప్పుడైనా చేసే అవకాశం ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే పలు సంస్థల్లో పనిచేసే ఉద్యోగ్ల జీతాలు సెలవు ఉన్నప్పటికీ వారి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇంకా గృహ, వాహన, వ్యక్తిగత రుణాల చెల్లింపు, మ్యూచువల్ ఫండ్ సిప్, ఎలక్ట్రిసిటీ సహా పలు బిల్లులను ఆదివారం, సెలవు రోజుల్లో కూడా చెల్లించవచ్చు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ-ప్రత్యక్ష నగదు బదిలీ) విధానం వచ్చిన తర్వాత ఎన్ఏసీహెచ్ సమర్థవంతమైన చెల్లింపుల మార్గంగా మారిందని, కరోనా వంటి సంక్షోభ సమయంలో ప్రభుత్వం సబ్సిడీలను చెల్లించేందుకు ఉపయోగపడినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో వివరించింది.