- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC Jobs: 249 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
దిశ, వెబ్‌డెస్క్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వశాఖాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 249 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC అధికారిక వెబ్‌సైట్ www.upsconline.nic.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య : 249
పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-6, అసిస్టెంట్ డైరెక్టర్-1, స్పెషలిస్ట్ గ్రేడ్3 అసిస్టెంట్ ప్రొఫెసర్-45, లెక్చరర్-1 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్-80, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్-116
అర్హతలు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు షుగర్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు పీజీ డిప్లమా/ఆయిల్ టెక్నాలజీలో బీఈ బీటెక్. సంబంధిత పనిలో ఏడాది అనుభవంతోపాటు 30 ఏళ్లకు మించరాదు. అసిస్టెంట్ డైరెక్టర్‌కు సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు సంబంధిత పనుల్లో మూడేళ్ల అనుభవంతోపాటు 35 ఏళ్లకు మించరాదు. స్పెషలిస్ట్ గ్రేడ్3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డిగ్రీ లేదా పీజీ డిప్లమో ఉండాలి. సంబంధిత పనిలో మూడేళ్ల అనుభవంతోపాటు 40 ఏళ్లకు మించరాదు. లెక్చరర్‌కు సోషల్ వర్క్‌లో మాస్టర్ డిగ్రీతో రెండేళ్ల అనుభవం, 35 ఏళ్లకు మించరాదు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ లా లేదా ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణత. బార్ అసోసియేషన్‌లో మూడేళ్ల అనుభవం. 30 ఏళ్లకు మించరాదు.
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్/ఇన్పర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీతోపాటు 30 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం..
రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ.. ఫిబ్రవరి 11, 2021
వెబ్‌సైట్…www.upsconline.nic.in