- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతీ బ్యాలెట్‌లో నోటా గుర్తు
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నోటా గుర్తును బ్యాలెట్ పత్రంపై ముద్రించారు. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే ఓటింగ్ యంత్రాలపై నూట గుర్తు ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గుర్తులు ప్రవేశపెట్టారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల కోసం 16 గుర్తులతో పత్రాన్ని ముద్రిస్తారు. ఈ విధంగా ముద్రించిన బ్యాలెట్ పత్రంలో అడుగు భాగాన నూట గుర్తుకు చోటు కల్పించారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇష్టం లేకపోతే ఓటర్లు తమ ఓటును నోటా కు వేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో నోటా ఓటు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు. వార్డు నెంబర్లకు ప్రతి ఓటు కీలకం కావడంతో అభ్యర్థులు నోటా గుర్తుపై ఓటు వేయకుండా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఒక్కోసారి 1,2 ఓట్ల తేడాతో సర్పంచ్, వార్డు సభ్యులు విజయం సాధించిన దాఖలాలు గతంలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో నోటా ఓట్లు కూడా అభ్యర్థుల గెలుపు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో నూట ఓటు కూడా కీలకంగా మారబోతోందని అధికారులు భావిస్తున్నారు.