- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బక్కచిక్కిన కిమ్.. కారణం ఇదేనట..?
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఎప్పుడు తన క్రూరమైన చర్యలతో మీడియా దృషిని ఆకర్షించే కిమ్ తాజాగా బక్కచిక్కి కనిపించి టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన కిమ్ ఇటీవల ఒక ప్రెస్ మీట్ కి హాజరయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో లో కిమ్ చిక్కిపోయినట్లు కనిపించాడు. దీంతో ఉత్తర కొరియా ప్రజలు తెగ బాధపడిపోతున్నారు. తమ నియంతకు ఏమైందని, ఆయన ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా..? అని ఆవేదన చెందుతున్నారట. తమ అధినేత సన్నబడినట్లు ఉన్న వీడియోను చూసి తమ హృదయాలు ఎంతగానో కలత చెందాయని దేశంలో చాలామంది చెప్పారని ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీటీవీ పేర్కొంది.
Before-and-after videos show that North Korean leader Kim Jong Un noticeably lost weight. On Sunday, the country's state media offered a rare public segment on it, although the reason for the weight loss is unclear https://t.co/RhQEqL7dXH pic.twitter.com/H9szU1rA1W
— Reuters (@Reuters) June 27, 2021
ఇక అసలు కిమ్ తగ్గడానికి గల కారణాలు ఏంటి అనేది..? అంతుచిక్కని మిస్టరీ గా మారింది. ఆయనకు ఆరోగ్యం బాగోలేక సన్నగా అయ్యారా..? లేక కావాలనే తగ్గారా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయమై ఉత్తర కొరియా కదలికలను గమనించే అమెరికాకు చెందిన 38 నార్త్ కొరియా డైరెక్టర్ జెన్ని టౌన్ తన అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. ” కిమ్ తగ్గడానికి ప్రధాన కారణం తెలియదు.. ఒకవేళ అనారోగ్యం కారణంగా కిమ్ తగ్గివుండవచ్చు.. లేకపోతే ఫిట్ గా ఉండడంకోసం కావొచ్చు. ఈ రెండు కాక ఉత్తర కొరియా ప్రస్తుతం ఆహార సమస్యను ఎదుర్కొంటుంది. అందులో భాగంగా ప్రజల కోసం బాధపడుతున్నట్లు నమ్మించి ఈ విధంగా ప్రచారం చేసుకొన్నట్లుగా కూడా భావించొచ్చు” అని తెలిపారు. ఏదిఏమైనా ప్రస్తుతం కిమ్ సన్నబడడం ఉత్తర కొరియా హాట్ టాపిక్ గా మారింది.