కరోనా కట్టడికి ‘కనిపిస్తే కాల్చేయండి’

by Shyam |   ( Updated:2020-09-11 05:07:37.0  )
కరోనా కట్టడికి ‘కనిపిస్తే కాల్చేయండి’
X

వాషింగ్టన్: చైనా నుంచి కరోనా వైరస్ దేశంలోకి వ్యాపించకుండా నియంత్రించడానికి తుపాకులతో కాల్చి చంపే ఆదేశాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వం జారీ చేసింది. చైనాతో సరిహద్దులను జనవరిలోనే మూసేసిన ఉత్తర కొరియా జులైలో ఎమర్జెన్సీని తీవ్ర స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క కరోనా కేసు నమోదు చేసుకోని ఈ దేశం మిత్ర దేశం చైనాతో సరిహద్దుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌‌గా గుర్తించింది. అక్కడ ప్రత్యేక ఆపరేషన్ ఫోర్స్‌ను కాపలా పెట్టింది. వారికి షూట్ టు కిల్ అనుమతులను ఇచ్చిందని దక్షిణ కొరియాలో విధులు నిర్వహిస్తున్న ఓ యూఎస్ కమాండర్ తెలిపారు.

Advertisement

Next Story