- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి గాంధీలో నాన్ కొవిడ్ చికిత్సలు..
దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి అన్ని రకాల వైద్యసేవలను ప్రారంభించున్నారు. కరోనా వ్యాధి విజృంభించిన నేపథ్యంలో ఏప్రిల్ నెల నుంచి గాంధీ ఆసుపత్రిలో కేవలం కొవిడ్ పేషెంట్లకు మాత్రమే చికిత్సలు అందిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ అనుమతితో కొవిడ్, నాన్ కొవిడ్ పేషెంట్లకు చికిత్సలందించేందుకు ఆసుపత్రి సిబ్బంది సిద్ధమయ్యారు.
ఇందుకోసం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి సిబ్బంది కేటాయింపులు చేపట్టారు. ఆసుపత్రిలోని సెకండ్, థర్డ్ ప్లోర్‌లోని బ్లాకులను కొవిడ్ పేషెంట్లకు, ఫోర్త్ ఫ్లోర్‌లోని బ్లాకులను కొవిడ్-మ్యూకర్ మైకోసిస్(బ్లాక్ ఫంగస్) పేషెంట్లకు కేటాయించారు. మిగతా అన్ని వార్డులను నాన్ కొవిడ్ సేవలకు, ఎమర్జెన్సీ సేవలకు కేటాయించారు. కొవిడ్ పేషెంట్ల తాకిడి కొనసాగుతుండటంతో సిబ్బందిలో 40శాతం మందిని కొవిడ్ చికిత్సల కోసం 60 శాతం మందిని నాన్ కొవిడ్ చికిత్సల కోసం కేటాయింపులు చేపట్టారు.