- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వద్దన్నా వినకుండా తలనొప్పి తెచ్చిన సీఎస్
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఓ ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోతోంది. అనుభవం, అవగాహన లేకుండా చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. రాష్ట్ర పాలనాధికారి చేసిన తప్పిదం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం అన్నింటా దేశవ్యాప్తంగా రికార్డు సాధిస్తోందంటూ చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ అతిపెద్ద విఫల గాథగా చరిత్రకెక్కింది. తొలుత రిజిస్ట్రేషన్ల శాఖను తప్పు పట్టిన ప్రభుత్వానికి ఇప్పుడు అదే శాఖను మెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాత పద్దతినే అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన సీఎస్ ఏం సమాధానం చెప్పుకుంటారు? ఎలా సమర్థించుకుంటారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్ కూడా సీఎస్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారులున్నా సోమేశ్ కుమార్‌ను అందలమెక్కించిన ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలంటున్నారు. ఈ వ్యవహారాన్ని అతిపెద్ద తప్పిదంగా సీఎస్ భావించాలని కూడా ఐఏఎస్ అధికారులు చెప్పుకుంటున్నారు.
సులువు కాదని చెబుతున్నా
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు గురించి రిజిస్ట్రేషన్ల శాఖ ముందుగానే సమగ్ర నివేదికను రూపొందించింది. అది అనుకున్నంత సులువు కాదని తేల్చి చెప్పింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ఒక కార్యాలయంలో ప్రారంభించి పరిశీలించాలని సూచించింది. సాంకేతిక అంశాలనూ ప్రస్తవించింది. అంతకు ముందు దీనిని వికారాబాద్ జిల్లా పరిగిలో పైలట్ ప్రాజెక్టుగా ఏడాదిన్నరపాటు పరిశీలించామని, సక్సెస్ అయిన తర్వాతనే ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టామని గుర్తు చేసింది. దానిలో కూడా మార్పులు చేయడంతో అది కూడా విఫలయత్నంగా మారిందని పేర్కొంది. 20 ఏండ్ల నుంచి నమోదైన రిజిస్ట్రేషన్ల రికార్డుల ప్రక్రియలో ఒకేసారి మార్పులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఈ నివేదికను సీఎంకు చేర్చాలని కోరుతూ సీఎస్‌కు పంపించింది. కానీ, నివేదిక సీఎస్ పేషీ దాటి బయటకు రాలేదు. కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఫలితంగా పాలనాధికారిపై భరోసాతో ప్రభుత్వం సెప్టెంబర్ ఎనిమిది నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు బ్రేక్ వేసింది.
అయినా చేసి తీరుతామంటూ
రిజిస్ట్రేషన్ల విభాగం సాధ్యం కాదని చెప్పినా సీఎస్ మాత్రం చేసి చూపిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ఏమేమో చేశారు. ప్రయత్నాలు ఫలించలేదు. సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. చివరకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను సీఎం ముందు దోషిగా చూపించారు. ఒకదశలో సీఎం కూడా రిజిస్ట్రేషన్ శాఖపై అసహనం వ్యక్తం చేశారు. కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు సీఎస్ సహా పది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు తమ విధులన్నీ పక్కన పెట్టి సీఎస్ కార్యాలయానికే పరిమితమయ్యారు. అవగాహన లేకపోవడంతో చేయలేకపోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇదే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలకు వివరించారు. సీఎస్ కు, సీఎంకు చెప్పే ధైర్యం చాలక మౌనంగా ఉండిపోయారు.
ఉన్నతాధికారినీ మార్చారు
కసరత్తు చేస్తున్న సమయంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాంకేతిక అంశాలను చూపిస్తూ ఫెయిల్ అవుతాయని స్పష్టం చేసింది. దీంతో, కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీని కదిలించారు. ఆ స్థానంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఏరికోరి రప్పించుకున్న అధికారిని కూర్చుండబెట్టారు. సదరు అధికారి కూడా ఏం చేయలేక చేతులెత్తశారు. చివరకు రిజిస్ట్రేషన్ల శాఖ నివేదించినట్లుగానే కొత్త విధానం విఫల చరిత్రను మూటగట్టుకుంది. ఎలా సక్సెస్ చేయాలో తెలియక సీఎస్ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూశారు. అంతకు ముందు అంతర్గతంగా ఓ ప్రయోగం చేసినట్లు ఓ సీనియర్ అధికారి వివరించారు. ధరణిలో వ్యవసాయ ఆస్తుల ప్రక్రియ కొలిక్కి రాగానే, వ్యవసాయేతర ఆస్తుల అంశంపై ప్లాన్ చేశారు. ఓ అధికారి దస్తావేజులతో ప్రయోగం చేశారు. అది అట్టర్ ప్లాప్ అయింది.
హైకోర్టు సాకుగా చూపి
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ఇప్పుడు…అప్పుడు అంటూ సీఎంకు చెప్పుకుంటూ వస్తున్న పాలనాధికారికి కూడా ఈ ప్రక్రియను సక్సెస్ చేయడం సాధ్యం కాదని స్పష్టమైంది. ఆలోచనలో పడ్డారు. మూడున్నర నెలలు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆదాయంపై భారీ ప్రభావం చూపించింది. సీనియర్లతో సమాలోచనలు చేశారు. అప్పటికే పరిస్థితి చేయిదాటింది. సీఎం తీవ్ర అసహంతో ఉన్నారు. అన్ని వర్గాలు వ్యతిరేకతతో మండిపడుతున్నాయి. ఎన్నికలలో వ్యతిరేకత బహిర్గమైంది. సరిదిద్దుకునేందుకు చాలా ప్రయత్నాలే చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పు ఉన్నతాధికారులకు ఓ అవకాశంగా మారింది. ప్రజల వ్యక్తిగత వివరాలు, కుటుంబం, ఆస్తులు, వారసులు, ఆధార్ కార్డుల వివరాలు అడుగున్న వైనాన్ని కోర్టు ప్రశ్నించింది. దానిని సాకుగా చూపించుకుంటూ పాత విధానానికి మార్గం సుగుమం చేసుకున్నారు.