- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోకియా 5జీ పరికరాల తయారీ!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ పరికరాల ఉత్పత్తిని ప్రారంభించినట్టు టెలికాం పరికరాల దిగ్గజ కంపెనీ నోకియా సోమవారం వెల్లడించింది. ఇప్పటికే తయారైన వాటిని 5జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్న దేశాలకు తరలిస్తున్నామని, దేశీయంగా 5జీ స్పెక్ట్రమ్‌ను ఇంకా వేలం వేయలేదని కంపెనీ తెలిపింది. వేలం పూర్తయ్యాక వీటి వినియోగం ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘భారత్‌లో మొదటి 5జీ ఎన్ఆర్(న్యూ రేడియో) తయారీ కంపెనీ నోకియాదే కావడం విశేషం.
కాగా ఇది కంపెనీ ఉత్పత్తి సామర్థ్యానికి నిదర్శనమని, అంతేకాకుండా నాణ్యమైన పరికరాల తయారీకి భారత్ అనువైనదని కంపెనీ అభిప్రాయపడింది. ఈ పరిణామాలు దేశీయ టెలికాం ఆపరేటర్లకు 5జీ సేవలను అందించేందుకు ఎంతో దోహదపడతాయి. 2008 నుంచి భారత్‌లోని చెన్నై ప్లాంట్ ద్వారా సుమారు 50 లక్షల టెలికాం పరికరాలను తయారు చేశామని, దాదాపు వంద దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నట్టు’ నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా మార్కెటింగ్ హెడ్ సంజయ్ వెల్లడించారు.