- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో హెల్త్ వర్కర్లకు ‘నో’ వ్యాక్సిన్
దిశ, తెలంగాణ బ్యూరో : వ్యాక్సిన్ పంపిణీలో విధించిన నిబంధనలతో ఫ్రంట్ లైన్‌లో ఉండే హెల్త్‌కేర్ వర్కర్లు వ్యాక్సిన్‌కు దూరమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యాక్సిన్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు వైద్య సిబ్బందికి కూడా అమలు పరచడంతో చాలా మంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
గురువారం వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లిన హెల్త్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేసారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది మొత్తం 4,26,785 ఉండగా వీరిలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో 4,16,010 మంది, ప్రైవేటు ఆసుపత్రుల పరిధిలో 1,0,775 మంది ఉన్నారు. వీరిలో బుధవారం (ఏప్రిల్ 05) వరకు మొదటి విడుత వ్యాక్సిన్‌ను 2,45,061 మందికి, రెండవ విడుత వ్యాక్సిన్‌ను 1,81,724 మంది వేసుకున్నారు. మొదటి విడుత వ్యాక్సిన్ తీసుకొని.. రెండవ విడుత వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు 63,337 మంది ఉన్నారు.
వీరిలో 28 రోజులు పూర్తయిన వారు గురువారం వ్యాక్సిన్ కోసం వెళ్లగా రిజిస్ట్రేషన్ ఉంటేనే వ్యాక్సిన్ వేస్తామని నిబంధనలు విధించారు. మొదటి విడత వ్యాక్సిన్ కోసం వెళ్లిన వారితో పాటు రెండో విడుత కోసం వెళ్లిన వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు నిరాకరించడంతో వైద్య సిబ్బంది నిరాశకు గురయ్యారు. 24 గంటల పాటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సేవలందిస్తున్న వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు నిబంధనలు విధించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకోకుండా తాము ఎలా ధైర్యంగా పేషెంట్లకు సేవలందిస్తామని వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వలనే ఎంతో మంది వైద్య సిబ్బంది ధైర్యం కొల్పోయి కరోనా బారినపడి అవస్థలు పడుతున్నారని మండిపడుతున్నారు. వ్యాధి సోకిన వైద్య సిబ్బందికి మెరుగైన చికిత్సలు అందించడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆరోపిస్తున్నారు. సరైన చికిత్సలు అందక ఇప్పటికే చాలా మంది వైద్య సిబ్బంది మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటనలు చేయలేదన్నారు.