ఉద్యోగులకు ఉద్వాసన పలికిన వొడాఫోన్ ఐడియా!

by Harish |
ఉద్యోగులకు ఉద్వాసన పలికిన వొడాఫోన్ ఐడియా!
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ టెలికాం దిగ్గజ సంస్థ వొడాఫోన్, ఐడియా ఆర్థిక నష్టాలను అధిగమించేందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. టీజీఆర్ బకాయిల చెల్లింపుల భారంతో పాటు నెట్‌వర్క్ విస్తరణ పనులు ఆగిపోవడం, ఒప్పందాల ఆలస్యం కారణాలతో ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా సుమారు 1500 మంది ఉద్యోగులను ఖర్చులు తగ్గించుకునే కారణంతో తొలగించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఎరిక్సన్, హువావే, నోకియా, జెడ్‌టీఈ 4జీ పరకరాల కొత్త ఆర్డర్ల ఆలస్యంతో వొడాఫోన్ ఐడియా సంక్షోభంలోకి జారుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, చైనా అంశంలో ఉన్న ఉద్రిక్తతల వలన అక్కడి నుంచి రావాల్సిన కొత్త ఆర్డర్లు నిలిచిపోయి ఉండొచ్చనే అంచనాలున్నాయి.

దీనికి తోడు ఇటీవల వొడాఫోన్ ఐడియా త్రైమాసిక ఫలితాల్లో సంస్థ చందాదారులు భారీగా తగ్గిపోయినట్టు తేలింది. ఇటీవల ఏజీఆర్ బకాయిలను చెల్లించడం వల్ల తమ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఈ క్రమంలో చెల్లింపులకు 20 ఏళ్ల గడువు ఇవ్వాలని కంపెనీ సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed