పనిగంటలు ముగిశాక బాస్ మెసేజ్ చేస్తే.. ఇకపై ఇల్లీగల్!

by Shyam |   ( Updated:2021-11-12 05:17:24.0  )
పనిగంటలు ముగిశాక బాస్ మెసేజ్ చేస్తే.. ఇకపై ఇల్లీగల్!
X

దిశ, ఫీచర్స్: పని గంటలు ముగిసిన తర్వాత కంపెనీ బాస్‌లు తమ సిబ్బందికి మెసేజ్‌లు పంపడాన్ని పోర్చుగల్ నిషేధించింది. ఈ చర్యను చట్టవిరుద్ధం చేస్తూ ఆ దేశ ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను ఆమోదించింది. ఈ మేరకు పోర్చుగల్‌లో ఇకపై పని వేళల తర్వాత సిబ్బందిని ఫోన్‌లో లేదా సందేశాల ద్వారా సంప్రదిస్తే ఉన్నతాధికారులకు జరిమానా విధించబడుతుంది. కార్మికులకు ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను అందించే లక్ష్యంగా ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.

కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సేవలను విస్తరించడం వల్ల ఉద్యోగుల ఇండ్లన్నీ తాత్కాలిక ఆఫీసులుగా మారిపోయాయి. ప్రైవసీ తగ్గిపోవడంతో పాటు యజమానుల జోక్యం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పోర్చుగల్ తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. వీటి ప్రకారం పని గంటల తర్వాత ఉద్యోగులను సంప్రదించినందుకు యజమానులకు జరిమానా విధించవచ్చు. అంతేకాదు ఇంటి నుంచి పని చేయడం వల్ల పెరిగిన గ్యాస్, విద్యుత్ బిల్లులను కూడా వారే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వర్క్-ఫ్రమ్-హోమ్ కల్చర్‌కు అనుగుణంగా కార్మికులకు సాయం చేసేందుకు పోర్చుగల్‌లోని సోషలిస్ట్ పార్టీ ప్రభుత్వం పలు చట్టాలను రూపొందించగా అవన్నీ పార్లమెంటులో ఆమోదం పొందలేదు. ప్రధానంగా ఉద్యోగులకు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకునే హక్కును కల్పించే ‘రైటు టు డిస్‌కనెక్ట్’ యాక్ట్.. తగినంత మద్దతు పొందడంలో విఫలమైంది.

కొత్త నిబంధనలు..

యజమానులు తమ ఉద్యోగుల పనిని ఇంటివద్ద పర్యవేక్షించకుండా నిషేధించడం, ఐసోలేషన్ నివారించేందుకు ఇతర ఉద్యోగులతో కనీసం రెండు నెలలకు ఒకసారి ముఖాముఖి సమావేశాలను నిర్వహించడం’ వంటి నియమాలకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇక పిల్లలున్న ఉద్యోగులైతే.. వారికి ఎనిమిదేళ్లు వచ్చే వరకు మేనేజ్‌మెంట్ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేకుండానే ఇంటి నుంచి పని చేసేందుకు చట్టపరమైన రక్షణ ఇవ్వబడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా డబ్బుతో ముడిపడిన మూఢ నమ్మకాలు

Advertisement

Next Story

Most Viewed