అత్యాచారం చేయలేదు.. ఇద్దరం శారీరకంగా కలిశాం అంతే..!

by Sumithra |   ( Updated:2021-08-20 10:19:59.0  )
Repe
X

దిశ, వెబ్‌డెస్క్ : గాంధీ హాస్పిటల్ అత్యాచార ఘటనలో కాస్తా పురోగతి వచ్చింది. ఘటన రోజు నుంచి అదృశ్యమైన రెండో మహిళ గురువారం గాంధీ హాస్పిటల్ సమీపంలోనే ప్రత్యేక్షం అయింది. మరోవైపు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సెక్యూరిటీ గార్డు విజయ్ కిశోర్ సైతం ఇదేరోజు పోలీసులకు చిక్కడం గమనార్హం. బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరూ పోలీసుల అదుపులో ఉండడంతో ఈ కేసు చిక్కుముడి సాయంత్రం వరకు వీడనుంది.

కాగా, ఘటన నాటినుంచి కనిపించకుండా పోయిన మహిళ గురువారం ఉదయం హిమాయత్ నగర్‌ మెయిన్ రోడ్ వద్ద ఓ మెడికల్ షాప్ ముంది కూర్చొని ఉండగా పెట్రోలింగ్ పోలీసులు గుర్తిపట్టి ఆమెను నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై వెంటనే ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం ఇద్దరు బాధితురాళ్లు, అనుమానితులను నార్త్ జోన్ పోలీస్ డీసీపీ ఆఫీస్‌లో విచారిస్తున్నారు. కాగా, తాను ఎవరిని అత్యాచారం చేయలేదని సెక్యూరిటీ గార్డు విజయ్ కిశోర్ పోలీసులు తెలిపినట్లు సమాచారం. మహిళ ఇష్ట ప్రకారమే శారీరకంగా కలిసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. హన్మకొండ జిల్లా కాజీపేటకు చెందిన విజయ్.. జులై 27న గాంధీ ఆస్పత్రిలో సెక్యురిటీ గార్డుగా చేరాడు. ఆయనకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా, ఇప్పటి వరకు సంతానం కలగలేదు.

ఆగస్ట్ 5న మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయనకు తోడుగా భార్య, మరదలు వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మహిళలపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసులో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. బుధవారం గాంధీ ఆసుపత్రి రేప్ ఘటనపై విచారణ కమిటీ డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డికి ప్రాథమిక నివేదికను అందజేసింది. బాధితురాలు ఆరోపిస్తున్నట్లు ఆ ప్రదేశాల్లో అత్యాచారం జరిగే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. నిత్యం పేషెంట్లు, అటెండర్లు, స్టాఫ్‌తో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నది. సీసీ కెమెరాల్లోనూ అలాంటి ఘటనలు నమోదు కాలేదని పేర్కొన్నారు. మరోవైపు మెడికల్ రిపోర్ట్ నమూనాల పరీక్షల్లోనూ మత్తు ప్రయోగం ఆనవాళ్లు లేవని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితులు తనకు క్లోరోఫాం, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్‌.. వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా ఇతరాల ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

యువకుడిని మత్తులోకి దింపిన ఒకే అమ్మాయి.. మూడు గొంతులు, మూడు పాత్రలు!

తాజాగా అందరూ పోలీసుల అదుపులో ఉండడంతో ఈ కేసు దర్యాప్తు ముగిసే అవకాశం ఉన్నది. అయితే మెడికల్ రిపోర్ట్‌లో అత్యాచారమే జరగలేదని పేర్కొనగా.. ప్రస్తుతం నిందితుడే తాము శారీరకంగా కలిశాం అని పేర్కొనడం సంచలనంగా మారింది. గాంధీ వైద్యులు ఎవరిని కాపాడటానికి అలాంటి తప్పుడు నివేధిక ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మిస్సింగ్ అయిన ఆ ఇద్దరు ఈ నాలుగు రోజులు ఎక్కడ ఉన్నారు..? ఇద్దరు కలిసే ఉన్నారా..? వేర్వేరుగా ఉన్నారా..? ఈ రోజు ఎవరి సహాయంతో బయటకు వచ్చారు..? అనే వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం ఈ ఘటనపై పోలీసులు అధికారికంగా పెదవి విప్పే చాన్స్ ఉన్నది.

ప్రభుత్వ వైద్యుడి పైశాచికత్వం.. బాతురూంలో నర్స్ నగ్న వీడియోలు తీసి..

Advertisement

Next Story

Most Viewed