- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసారి ఖైదీల విడుదల లేదు.. ఎందుకంటే ?
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలోని పలు జైళ్లల్లో మగ్గుతున్నవారిలో సత్ర్పవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ఈ ఏడాది కూడా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఏండ్ల తరబడి జైళ్లలో శిక్ష అనుభవిస్తూ.. సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ హోం శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేదిలు ప్రభుత్వానికి మార్గదర్శకాలు అందించారు. సీఎం ప్రకటించిన నాటికీ, ఆగస్టు 15 నాటికి మధ్య సరిగ్గా 25 రోజులు మాత్రమే సమయం ఉండడంతో వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని జైళ్ల శాఖ భావించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విడుదలకు అవకాశం ఉన్నవారి జాబితాను రాష్ట్రంలోని అన్ని జైళ్ల నుంచి జైళ్ల శాఖ కార్యాలయానికి ప్రతిపాదనలు అందాయి. అయినా, ప్రభుత్వం నుంచి చేపట్టాల్సిన కసరత్తు, తదుపరి ప్రక్రియలు పూర్తికాకపోవడంతో సీఎం కేసీఆర్ భావించినట్టుగా స్వాతంత్ర్య దినోత్సవం రోజు సత్ర్పవర్తన కలిగిన ఖైదీలు విడుదల కాలేకపోతున్నారు.
నాలుగేండ్ల తర్వాత శుభవార్త
రాష్ట్రవ్యాప్తంగా చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లతో పాటు జిల్లాస్థాయి, సబ్ జైళ్లు అన్నీ కలిపి దాదాపు 37 జైళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 6848 ఖైదీలను ఉంచేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జైళ్లలో 5777 మంది ఖైదీలు ఉన్నారు. అందులో 300 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15, గణతంత్ర దినోత్సవం జనవరి 26, గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీల్లో వివిధ కేసుల్లో శిక్షలు అనుభవిస్తూ, జైళ్ళలో మంచి ప్రవర్తనతో ఉంటున్న ఖైదీలకు ఒక అవకాశంగా ప్రభుత్వం పలు సందర్భాల్లో వారికి ఉపశమనం కల్పిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు 251 మంది ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత 2017, 2018, 2019 సంవత్సరాల్లో ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ వెంటనే డీజీపీ మహేందర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేదిలు సీఎం కేసీఆర్‌ను కలిసి ఖైదీల విడుదలకు మార్గదర్శకాలను అందించారు.
ఖైదీల విడుదలకు పూర్తవ్వని ప్రక్రియ
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మంది ఖైదీలను విడుదల చేసేందుకు జైళ్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అనంతరం నిబంధనల ప్రకారం హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో స్క్రూట్నీ సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదం కావాల్సి ఉంది. కానీ, ప్రభుత్వానికి జాబితా అందిన తర్వాత హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో స్క్రూట్నీ సమావేశం నిర్వహించలేదని విశ్వసనీయ సమాచారం. ఇక స్క్రూట్నీ సమావేశమే కాకుంటే, క్యాబినెట్‌లో ఎలా ఆమోదం పొందుతుంది? సాధారణంగా ఈ మార్గదర్శకాల్లో అండర్ ట్రయల్, రిమాండ్ ఖైదీలకు, పీడీ యాక్టు ద్వారా జైళ్లల్లో నిర్భందించడం లాంటి వారికి అవకాశం ఉండదు. ముఖ్యంగా ఆయా కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వృద్ధులు, ఖైదీలకు విధించిన జైలు శిక్ష కాలం, ఇప్పటి వరకూ పూర్తయిన శిక్షా కాలం, వారి ప్రవర్తన తదితర అంశాల ప్రతిపాదికన జాబితాను రూపొందిస్తుంటారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 37 జైళ్ల నుంచి 100 మందికి పైగా విడుదలకు అధికారులు జాబితాను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేదిని వివరణ కోరగా ఆగస్టు 15 పురస్కరించుకుని విడుదల చేయాల్సిన ఖైదీల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆగస్టు 15 అంటే ఆగస్టు 15కే కాదు.. గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
మార్గదర్శకాలలో మార్పుల కోసమేనా..
వాస్తవానికి సత్ప్రవర్తన ఖైదీలను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ భావించినప్పటికీ, 25 రోజుల వ్యవధిలోనూ అధికారులు అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయలేకపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు విడుదల చేసినా.. 200 నుంచి 250 మంది ఖైదీలను విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఈ ఏడాది అధికారులు 100 మంది జాబితాను మాత్రమే తయారు చేయడంతో .. ప్రభుత్వం మార్గదర్శకాలను మార్చాలని భావించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, 100 మంది ఖైదీల స్థానంలో దాదాపు 200 మందికి పైగా ఖైదీలు అక్టోబర్ 2 గాంధీ జయంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏదీ, ఏమైనా.. ఖైదీలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత.. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 నాడు ఖైదీలను విడుదల చేయడం లేదనే వార్త ఖైదీలకు, వారి కుటుంబీకులకు ఆశనిపాతం అయ్యింది.