సీఏఏను సవరించే ఆలోచన లేదు: కేంద్రం

by Shamantha N |
సీఏఏను సవరించే ఆలోచన లేదు: కేంద్రం
X

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను సవరించే ఆలోచన తమకు లేదని కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ చట్ట పరిధిలోకి ఇతర మైనార్టీలను తీసుకువచ్చేందుకుగాను చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదన ఏదీ లేదని రాజ్యసభలో స్పష్టం చేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ అబ్దుల్ వహాబ్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ‘సీఏఏ చట్టం కింద పౌరసత్వం పొందేందుకు అర్హులైన వారు కేంద్రం నిర్ణీత నియమాలను ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీఏఏ నియమాలను రూపొందించేందుకు 9 జనవరి 2022 వరకు తమకు గడువును పెంచాలంటూ సబార్డినేట్ లెజిస్లేషన్‌పై లోక్ సభ, రాజ్యసభల కమిటీలు అభ్యర్థించాయి’ అని తెలిపారు.

Advertisement

Next Story