- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రకటన చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా సమాచారం పంపింది. అయితే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్నందున ఆ జిల్లాలోగానీ, ఎన్నికల ప్రచారంలోగానీ పీఆర్సీ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోరాదని సూచించింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ షరతులకు లోబడి అనుమతి ఇస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్ కుమార్ స్పష్టం చేశారు. పీఆర్సీ ప్రకటనకు వెసులుబాటు ఇచ్చినందున దాన్ని రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకోరాదని స్పష్టం చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ప్రస్తావించి ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వనున్నదీ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు 29% మేర ఫిట్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తున్నందున తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండుచోట్లా టీఆర్ఎస్ గెలుపొందడంతో ఉద్యోగులు ఆశించినదానికంటే కొంత ఎక్కువే సీఎం ప్రకటించే అవకాశం ఉంది.