‘రంజాన్ మాసంలో సామూహిక ప్రార్థనలు వద్దు’

by Shyam |
‘రంజాన్ మాసంలో సామూహిక ప్రార్థనలు వద్దు’
X

హైదరాబాద్: రంజాన్ మాసంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించొద్దని తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం తెలిపారు. ఈ మాసంలో ప్రతిఒక్కరూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ఇదే విషయమై కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈసారి ప్రత్యేకంగా రంజాన్ నెలలో పేదలకు దానాలు చేయండని పిలుపునిచ్చారు. అలాగే, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు. ఇఫ్తార్ విందులు తమ తమ ఇళ్లలోనే కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని అన్నారు.

Tags: prayers, during Ramzan,Telangana, Waqf Board Chairman Mohammed Saleem

Advertisement

Next Story

Most Viewed