- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మాస్క్’ ఉంటే మంచిది..తప్పనిసరి కాదు
దిశ, న్యూస్ బ్యూరో : మార్చి 19 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించిన నిబంధనలపై తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులంతా మాస్క్‌లు ధరించాలని నిబంధన తప్పనసరి అనే ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు వివరించారు. అయితే వీలైనంత వరకూ మాస్క్‌లు లేదా కర్చీఫ్‌లు ధరించాలని సూచనప్రాయంగా నిబంధనల్లో పేర్కొన్నారు. పరీక్ష ముందు, తర్వాత కూడా ఎక్కువ మంది విద్యార్థులు గుమిగూడి ఉండొద్దన్నారు. వైరస్ తీవ్రత, వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5.34లక్షల మంది ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 6 వరకూ పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభయ్యే పరీక్షలకు 5నిమిషాల్లోపు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా అనుమతించనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది.
Tags: 10th exams, education board, march 19, masks and carchifs no mandate, 5mints late acceptable