కరోనా కబళిస్తున్నా.. లాక్‌డౌన్‌కు ‘నో’

by Shamantha N |
కరోనా కబళిస్తున్నా.. లాక్‌డౌన్‌కు ‘నో’
X

బ్రెసీలియా: ఆ దేశంలో కరోనా మరణాలు రోజుకు ఇంచుమించు నాలుగువేల వరకు చోటుచేసుకుంటున్నా లాక్‌డౌన్ విధించబమోని అధ్యక్షుడు స్పష్టం చేశారు. ‘లాక్‌డౌన్ అనేది రాజకీయమే. ఇంటి గడపదాటవ్వదు- అన్నింటినీ మూసేయాలనే పాలిటిక్స్‌ను నేను యాక్సెప్ట్ చేయను. ఎట్టిపరిస్థితుల్లో దేశంలో లాక్‌డౌన్ ఉండదు’ అని బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. గతేడాది కూడా కరోనా ముప్పును ఆయన చిన్నచూపు చూశారు. ఇంకా ఆయన వైఖరిలో మార్పు రాలేదని భావిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే అక్కడ 3829 మంది కరోనాతో మరణించారు. అంతకు క్రితం 4195 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు 3.36 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. తాజాగా, దక్షిణాఫ్రికా వేరియంట్ కూడా ఇక్కడ వెలుగుచూసింది. అత్యంత వేగంగా వ్యాపించే బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లతో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. కానీ, దేశాధ్యక్షుడు బోల్సోనారో మాత్రం కట్టడి చర్యలపై విముఖంగా ఉన్నారు.

Advertisement

Next Story