నో హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ విత్ సెల్ ఫోన్ టాక్.. మహిళా పోలీసుల డ్రైవింగ్

by Shyam |
నో హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ విత్ సెల్ ఫోన్ టాక్.. మహిళా పోలీసుల డ్రైవింగ్
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : ఈ చిత్రం చూడండి.. ఎన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు కన్పిస్తున్నాయో..? ఎంత నిర్లక్ష్యం రాజ్యమేలుతుందో..? ఒక్క బైక్ మీద ముగ్గురు ప్రయాణించడమే పెద్ద తప్పు.. అలాంటిది అందులోని ఇద్దరూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు.. అంతేనా.. మధ్యలో కూర్చున్న ఆమె.. డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మాట్లాడేందుకు సహకరిస్తుంది. ఇక హెల్మెట్ ఉందా..? అంటే అదీ లేదు.. ఇక అసలు విషయం ఏంటంటే..!

ఎవరో సామాన్య వ్యక్తులు ఇలా వెళ్తున్నారులే అనుకుంటే బాధ్యత లేదేమో అనుకుంటాం.. కానీ చూశారుగా.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించే పోలీసులే ఇలా చేస్తే.. ఇక సామాన్య పౌరులకేం చెపుతాం.. ఖమ్మంలోని స్టేషన్ దారిలో ఇలా తప్పు మీద తప్పు నిర్లక్ష్యమై రోడ్డేలుతుంటే ఇలాంటి వారి ప్రాణాలకు ఎలాగూ భద్రతుండదు.. మరి ఏ పాపం చేయని అవతలి వారి ప్రాణాలకు భద్రతేదీ..? సీపీ సార్ చూశారుగా.. ఇక ‘అంతులేని నిర్లక్ష్యం’పై నిర్ణయం మీదే.

Advertisement

Next Story