మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదు

by srinivas |
మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడలో పర్యటించిన కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రైతులు యార్డులు, మధ్యవర్తులకు పన్నులు కడుతున్నారని, ఇక మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదని వెల్లడించారు. రైతుకు వచ్చే ఆదాయంలో దాదాపు 8శాతం పన్నులకే పోతుందని, కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వం 22రకాల పంటలకు మద్ధతు ధర ఇస్తోందని, కూరగాయల రైతుకూ గిట్టుబాటు రావాలన్నది మా విధానమని స్పష్టం చేశారు. కూరగాయలు, పండ్ల నిల్వ సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామన్న కేంద్రమంత్రి.. గ్రామస్థాయిల్లోనూ రైతులను సంఘటితం చేస్తామని తెలిపారు. గ్రామాల్లోనే రైతులు పండ్ల నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు.

Advertisement

Next Story