- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజిటర్లకు నో ఎంట్రీ.. ప్రజలకు మొదలైన కష్టాలు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ కార్యాలయాల్లో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. కార్యాలయాల్లోకి విజిటర్లకు అనుమతి నిరాకరిస్తున్నారు. అత్యవసరమైతేనే సదరు అధికారుల పర్మిషన్తీసుకుని పంపిస్తున్నారు. చాలా వరకు సెక్యూరిటీ ప్రాంతాల్లోనే వినతులు తీసుకుని, వాటిని శానిటైజ్‌చేసి అధికారులకు పంపిస్తున్నారు. ఒమిక్రాన్ భయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ముందస్తుగానే కట్టడి చర్యలు చేపట్టారు. మాస్కులు మళ్లీ తప్పనిసరి అయ్యాయి. కార్యాలయాల ఎంట్రన్స్‌లోనే శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
అధికారుల చాంబర్లలో అద్దాలు
కరోనా విజృంభన సమయంలో ఏర్పాటు చేసిన ఫేస్కవరేజ్ అద్దాలు మళ్లీ ఏర్పాటయ్యాయి. సెకండ్‌వేవ్ తర్వాత పరిస్థితులు అనుకూలించడంతో ప్రభుత్వ కార్యాలయాలు యధాతథంగా పని చేశాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ భయం దేశంలో మొదలైంది. ఈ దశలో వ్యాప్తి ఎక్కువగా ఉందనే కారణంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు విభాగాలు, చాంబర్లలో అద్దాలు మళ్లీ ఏర్పాటయ్యాయి. ఉన్నతాధికారుల చాంబర్లలో ఒకటీ, రెండు కుర్చీలకే పరిమితం చేశారు. కేవలం అత్యవసరమైన పనులకు మాత్రమే విజిటర్లను కలుస్తున్నారు.
అంతేకాకుండా కొన్ని శాఖల్లో చాలా వరకు శాఖాపరమైన సమావేశాలను సైతం తగ్గించారు. మూకుమ్మడిగా ఏర్పాటు చేసే సమావేశాలను రద్దు చేసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితి అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కాన్ఫరెన్స్హాళ్లను దాదాపుగా వినియోగించడం లేదు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ సందర్శకుల ప్రవేశాలపై ఆంక్షలు మొదలయ్యాయి. సంబంధిత అధికారి నుంచి అనుమతి ఉంటే తప్ప సందర్శకులను ఆఫీసుల్లోకి వెళ్ళడానికి వీలు లేదని స్పష్టం చేస్తున్నారు. రోజువారీగా విజిటింగ్సమయాలను దాదాపుగా రద్దు చేస్తున్నారు.
అంతేకాకుండా వివిధ శాఖల నుంచి వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాలను, ఫైళ్లను కార్యాలయం లోపలికి వెళ్లి సంబంధిత సెక్షన్లో ఇవ్వడానికి బదులుగా ఎంట్రీ గేటు దగ్గరే ఒక ‘డాక్’ సెక్షన్‌ను ఏర్పాటు చేసి అక్కడ శానిటైజ్ చేస్తున్నారు. ఆఫీసు లోపలికి వెళ్లే ప్రతీ ఒక్కరికీ మాస్క్ఉంటేనే అనుమతి ఇస్తూ విధిగా శానిటైజ్ చేస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నట్టయితే వారిని లోపలికి అనుమతించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన ద్వారాల్లో థర్మల్స్క్రీనింగ్మళ్లీ మొదలైంది. అంతేకాకుండా వినతులను సైతం తగ్గిస్తున్నారు. ఆన్‌లైన్‌లో చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. ముందస్తుగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సెలవులు మంజూరు చేస్తున్నారు. ఇక గర్భిణీలకు కూడా ముందుగానే సెలవు ఇస్తున్నారు.