పెద్దపులి సంచారం.. వారికి నో ఎంట్రీ..?

by Sumithra |
పెద్దపులి సంచారం.. వారికి నో ఎంట్రీ..?
X

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో గత కొన్ని రోజుల నుంచి పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర మండలాల ప్రజలు బెంబేలెత్తిపోతున్న విషయం తెలిసిందే. పాకాల సరస్సు ప్రాంతంలో పులి సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దీంతో రోజువారీగా నర్సంపేట నుంచి కొత్తగూడకు ప్రయాణం చేసే ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్తగూడ నుంచి నర్సంపేట వైపు వెళ్లేందుకు పాకాల మీదుగా రాకపోకలు చేయకూడదని కొత్తగూడ సెంటర్లో పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో పరిసర గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story