ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌లేదు: ఎస్పీ సునీల్ ద‌త్‌

by Sridhar Babu |   ( Updated:2020-10-29 10:56:48.0  )
ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌లేదు: ఎస్పీ సునీల్ ద‌త్‌
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పిన‌పాక అడ‌వుల్లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింద‌ని, ముగ్గురు మావోయిస్టులు మ‌ర‌ణించిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేద‌ని ఎస్పీ సునీల్‌ద‌త్ స్ప‌ష్టం చేశారు. గురువారం సాయంత్రం ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన‌ట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో నిముషాల వ్య‌వ‌ధిలోనే వైర‌ల్‌గా మారింది. ఎన్‌కౌంట‌ర్‌ లాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని ఎస్పీ తెలిపారు. అయితే జిల్లా అట‌వీ ప్రాంతాల్లో కూంబింగ్ జ‌రుగుతోంద‌ని వివ‌రించారు.

Advertisement

Next Story