సిబ్బందికి కరోనా.. మంత్రి ఎర్రబెల్లికి..?

by Anukaran |
సిబ్బందికి కరోనా.. మంత్రి ఎర్రబెల్లికి..?
X

దిశ ప్రతినిధి, వరంగల్: ‘మనమంతా మనుషులం… సాటి మనుషులపై మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషెంట్లను కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతో పాటు విస్తృతంగా తిరిగిన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ రావడంతో మంత్రి సోమవారం ఉదయం స్వయంగా కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందుగానే చెప్పినట్లు తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరికీ మంత్రి ధన్యవాదాలు తెలియచేశారు. కరోనా వైరస్ సామాజిక సమస్యగా పరిణమించిందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేకపోవడం, మందులు రాకపోవడం ఓ విచిత్రమై విపరీతంగా మంత్రి పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇందుకు మనం, మన దేశం, రాష్ట్రం ఎవరూ అతీతులం కాదని మంత్రి చెప్పారు. స్వీయ నియంత్రణ పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతని, పరిసరాల పారిశుధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే మాస్కులను ధరించడం, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని.. కాస్త సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed