కలవరమాయే మదిలో.. గులాబీ బాస్ వస్తారా.. రారా?

by Shyam |   ( Updated:2021-07-23 08:28:49.0  )
cm-kcr government
X

దిశ‌ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాలోని న‌ల్లబెల్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ‌స్తారా.. రారా? అన్న విష‌యంపై సందిగ్ధత నెలకొంది. న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి తండ్రి రాజిరెడ్డి ఇటీవ‌ల మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈనెల 24న ద‌శదిన క‌ర్మ నేప‌థ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజ‌రుకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి కార్యాల‌యం నుంచి రెండు రోజుల కిందట ప్రక‌ట‌న కూడా విడుద‌లైంది.

అయితే, శుక్రవారం సాయంత్రమైనా ముఖ్యమంత్రి ప‌ర్యట‌న‌పై స్పష్టత క‌రువైంది. పోలీస్‌శాఖ‌కు కూడా స్పష్టమైన సమాచారం లేద‌ని సమాచారం. వ‌ర్షాల ప్రభావంతోనే గులాబీ బాస్ ప‌ర్యట‌న ర‌ద్దు కావొచ్చనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, సీఎం ప‌ర్యట‌న ఉంటుందా.. ఉండదా..? అనే విషయంపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో గులాబీ నేతలు కలవరపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed