రాత్రి కర్ఫ్యూ వల్ల లాభం లేదు.. పగలు 144 సెక్షన్ పెట్టండి

by Shyam |
రాత్రి కర్ఫ్యూ వల్ల లాభం లేదు.. పగలు 144 సెక్షన్ పెట్టండి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. అయితే రాత్రి కర్ఫ్యూపై సీఎల్పీ నేతల భట్టి విక్రమార్క స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి పూట కర్ఫ్యూ విధింపుతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రాత్రి పూట కాకుండా పగలు కర్ఫ్యూ విధించాలని కోరారు. 144 సెక్షన్ పెట్టి కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కరోనా బారినపడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story