- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ముగ్గురిని చంపింది శ్రీకాంతే.. సీపీ కార్తికేయ స్పష్టం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సంచలనం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం నిజామాబాద్ సీపీ కార్తికేయ కమిషనరేట్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈనెల 7న అర్ధరాత్రి డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హర్వేస్టర్ షెడ్‌లో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారని డిచ్‌పల్లి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన స్థానిక డిచ్‌పల్లి సీఐ, ఎస్ఐ అక్కడికి వెళ్లి విచారణ ప్రారంభించారు. హర్వేష్టర్ షెడ్‌లో పంజాబ్‌కు చెందిన హర్పల్ సింగ్ (32), జోగింధర్ సింగ్ (46), సంగారెడ్డి జిల్లా జరసంగం మండలం బోజ్యానాయక్ తాండాకు చెందిన క్రేన్ ఆపరేటర్ బానోత్ సునిల్ (25) హత్యకు గురైనట్లు గుర్తించారు. ముగ్గురు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు హత్యకు గురి కావడంతో పాత కక్ష్యల నేపథ్యంలో జరిగిందా? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. ముడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మూడు బృందాలను ఏసీపీ వేంకటేశ్వర్లు పర్యవేక్షణ చేయగా, మొత్తం టీంలను అదనపు డీసీపీ అరవింద్ బాబు లీడ్ చేశారు.
నేరం జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్టోబర్ 12న గాజుల రామారంలోని జువైనల్ జైలు నుంచి విడుదలైన గంధం శ్రీకాంత్‌పై అనుమానంతో విచారణ నిమిత్తం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో కేసు కొలిక్కి వచ్చింది. ఈనెల 7వ తేదీన అర్ధరాత్రి ఒక్కడే డిచ్‌పల్లికి వచ్చి, హర్వేష్టర్ షెడ్‌లో ఆరు బయట పడుకున్న సునిల్‌పై దాడి చేసి అతని వద్దనున్న సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో అక్కడే ఉన్న సుత్తితో అతడి తలపై మోది హత్య చేశాడు. తరువాత షెడ్డులో గాడ నిద్రలో ఉన్న హర్పల్ సింగ్, జోగింధర్ సింగ్‌ల తలపై కూడా బలంగా మోది హత్య చేసి వారి వద్దనున్న మూడు సెల్‌ఫోన్‌లు, రూ.3 వేల నగదు తీసుకొని పరారైనట్లు శ్రీకాంత్ ఒప్పుకున్నాడు. విచారణలో శ్రీకాంత్ నేరం చేసినట్లు రుజువు కావడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.