‘గ్రేటర్‌’ పై కాషాయ జెండా ఎగిరేనా..!

by Shyam |
‘గ్రేటర్‌’ పై కాషాయ జెండా ఎగిరేనా..!
X

గ్రేటర్ వరంగల్‌లో జెండా ఎగరేసేందుకు బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వరంగల్ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన అధిష్టానానికి కూడా లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు గ్రేటర్ వరంగల్ ఎన్నికల పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని, పార్టీని గెలిపించి తీరుతాననే హామీతో లేఖ రాసినట్లు తెలుస్తోంది.

దిశ ప్రతినిధి, వరంగల్:

అర్వింద్ ప్రత్యేక దృష్టి..

నిజామాబాద్‌కు చెందిన ఎంపీ అర్వింద్‌కు వరంగల్‌తో లింకేంటి? ఆయన వరంగల్‌లో పాగావేయాలని ఎందుకు అనుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గ్రేటర్ వరంగల్‌లో ఈ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. దీనికి తోడు ఇటీవల వరంగల్‌లో అర్వింద్ పర్యటన పార్టీకి కలిసి వచ్చింది. వరంగల్ పర్యటనలో అర్వింద్ స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనా భూకబ్జా ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలైన దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ గజం భూమి కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. అర్వింద్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన టీఆర్ఎస్ నాయకులు ఆయన వాహనంపై, బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడిచేశారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో బదులిచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అధికార పార్టీ నేతలు అది మరిచి దాడులు చేయడం బీజేపీ పార్టీకి కలిసి వచ్చినట్లైంది. ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో చర్చ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం స్పందించడంతో కాస్త వేడి పెరిగింది. తర్వాత చల్లబడినప్పటికీ ఈవివాదం బీజేపీకి ప్లస్ అయినట్లే చెప్పవచ్చు. అసలే వరంగల్ నగరంలో పెద్దగా పార్టీ కార్యకలాపాలు చేయడం లేదన్న విమర్శల నుంచి బయటపడి కొంత మైలేజ్ పెంచుకుంది బీజేపీ.

వరదల సమయంలో పర్యటనలు..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరం గల్‌లో పలు కాలనీలు ముంపునకు గుర య్యాయి. వరదలు రాకముందే బీజేపీ ఎంపీ అర్వింద్ వరంగల్ పర్యటన చేసి.. కబ్జాలపై విమర్శలు చేశారు. ఇప్పుడు వ రంగల్‌ను ఆ కబ్జాలే ముంచేయడంతో బీజే పీ చేసిన విమర్శలకు బలం చేకూర్చినట్టైం ది. సరిగ్గా ఇదే అంశాన్ని నాయకులు జనా ల్లోకి తీసుకెళ్లి ఎన్నికల వేళ జనం ముం దుంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

బలమైన నాయకుల కోసం..

58 డివిజన్‌లు ఉన్న వరంగల్ మున్పిపల్ కార్పొరేషన్ లో తమకు అనుకూలంగా ఉన్న డివిజన్‌లలో బలమైన నాయకులను రంగంలోకి దించి గెలవాలన్నదే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే చాలామంది బీజేపీ నేతలు, అర్వింద్ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆ యనతో మంతనాలు జరుపుతున్నట్లు తె లుస్తోంది. వరంగల్ అర్బన్ బీజేపీలో గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. వీటిని ఒక్కటి చేయడం కేవలం అర్వింద్ వల్లే సాధ్యమన్న భావన బీజేపీ వర్గాల్లో ఉంది. నిజానికి వరంగల్ నగరంపై అరవింద్ కంటే బండి సంజయ్‌కు ఎక్కువ పట్టుంది. కానీ, సంజయ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున పూర్తిస్థాయిలో వరంగల్‌పై దృష్టిసారించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలను అప్పగించాలని అధిష్టానం చూస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.గతంలో వరంగల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగిరిన చరిత్ర ఉంది.

పూర్తిస్థాయి ఇన్‌చార్జిగా..!

గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఇన్‌చార్జిగా నియమించి, అన్ని విధాలా తననే బాధ్యుడిని చేయాలని ఎంపీ అర్వింద్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే వరంగల్ పర్యటనతో అక్కడ పార్టీని యాక్టివ్ చేసిన అర్వింద్ నాయకత్వంపైనే వరంగల్ నేతలు కూడా మొగ్గు చూపుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే వరంగల్ బీజేపీలో ఎన్నికలను పూర్తిస్థాయిలో మీద వేసుకుని చేసే నాయకత్వం కన్పించడం లేదు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన శక్తి కోసం స్థానిక నాయకత్వం ఎదురు చూస్తోంది. ఈ నేథ్యంలోనే అర్వింద్‌ను రంగంలోకి దించి గ్రేటర్ వరంగల్ పై బీజేపీ జెండా ఎగురువేయాలన్నదే పార్టీ కూబా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అర్వింద్ రాసిన లేఖపై పార్టీ పెద్దలు కూడా సుముఖంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed