నిజామాబాద్ లో ముగ్గురు మృతి.. కారణం ఏమిటంటే..?

by Shyam |
నిజామాబాద్ లో ముగ్గురు మృతి.. కారణం ఏమిటంటే..?
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున బీహార్ నుంచి కేరళలోని కోజికోడ్ కు వెళ్తున్న స్కార్పియో వాహనం జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు కేరళకు చెందిన స్టెలీన్ (21), అనీష్ థామస్ (32), అతని తనయుడు అనాలియా గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story