పాక్ గెలిచిందని టపాసులు పేల్చి.. నానా హంగామా..!

by Sumithra |
పాక్ గెలిచిందని టపాసులు పేల్చి.. నానా హంగామా..!
X

దిశ, నవీపేట్ : క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచులో టీం ఇండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంతవరకు దాయాది దేశం భారత్‌పై గెలవలేదు.కానీ, టీ-20 వరల్డ్ కప్ 2021లో ఒక్క వికెట్ నష్టపోకుండా పాక్ టీం ఇండియాను చిత్తుగా ఓడించడంతో భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు. అయితే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ వర్గానికి చెందిన కొందరు పాక్ విజయాన్ని సెలెబ్రేట్ చేశారు.

ఆదివారం రాత్రి పాక్ జట్టు మ్యాచ్ గెలవగానే టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ ఘటన నవీపేట్ మండల కేంద్రంలోని బర్కత్‌పుర కట్ట కింద ఏరియాలోని మైసమ్మ గల్లీలో వెలుుగుచూసింది. అయితే, దేశానికి వ్యతిరేకంగా పాక్ విజయాన్ని సెలెబ్రేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు శ్రీనివాస్ గౌడ్, తమ్మలి కృష్ణ, ఒడ్డె రవి, భాను గౌడ్, నరేష్, తేజ తదితరులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు వారిపై చర్యలు తీసుకుంటానని ఎస్ఐ యాకుబ్‌ తెలిపారు.

Advertisement

Next Story