- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘ఎంపీ అరవింద్ రాజకీయ అజ్ఞాని’’
దిశ, నిజామాబాద్: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పసుపు పంట క్వింటల్‌కు రూ.4000 నుంచి రూ.4500 వరకు ధర మించక పోవడంతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందాల్సిన పరిస్థితికి చేరుకుంది అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ స్థితికి ప్రధానంగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ, టీఆర్ఎస్‌లు రైతులకు ఆశ చూపి మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పసుపు, ఎర్రజొన్న రైతుల గురించి స్థానిక ఎంపీ అరవింద్ లేనిపోని ఆశలు కల్పించి నట్టేట ముంచాడని ఎద్దేవా చేశారు. రైతుల ప్రధాన డిమాండ్ అయినా పసుపు బోర్డు, మద్దతు ధర 5రోజుల్లో సాధిస్తానని చెప్పి నిండా ముంచిన ఎంపీ సన్మానాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎంపీ అరవింద్ రాజకీయ అజ్ఞాని అని ఘాటుగా స్పందించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా నిజామాబాద్ జిల్లాకు వచ్చి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు ఒక రూ.లక్ష రుణమాఫీ అని, ఎర్ర జొన్న రైతులకు బోనస్ అని, పసుపు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతాంగాన్ని ఓట్లు దండుకుని నిండా ముంచారు అని మానాల మోహన్ రెడ్డి అన్నారు.