అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

by Shyam |
అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ, నిజామాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని మద్నూర్ చెక్‌పోస్టును గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు. ఇతర రాష్ట్రాల ప్రజలను జిల్లాలోకి రానివ్వొద్దని సూచించారు. జిల్లావాసులను సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లనివ్వద్దని పేర్కొన్నారు. అనంతరం కుర్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆరబెట్టిన, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మద్నూర్ మండలంలోని సిర్పూర్, చిన్న‌టాక్లి, పెద్ద‌టాక్లి గ్రామాలను సందర్శించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: Nizamabad, check post, visit, collector sharath

Advertisement

Next Story