అసిస్టెంట్ ప్రొఫెసర్లపై నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ వేధింపులు

by Shyam |
అసిస్టెంట్ ప్రొఫెసర్లపై నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ వేధింపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం కళాశాల ప్రిన్సిపాల్ బీ నారాయణ కాంట్రాక్ట్​ అధ్యాపకులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వారు తెలంగాణ మానవహక్కుల కమిషన్ ను శనివారం ఆశ్రయించారు. తామంతా 20 ఏండ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నామని, అయితే కావాలనే తమను బదిలీ చేస్తూ వేధిస్తున్నారని అన్నారు. మహిళా అధ్యాపకులని కూడా చూడకుండా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సెప్టెంబర్​ 1వ తేదీ నుంచి తమను బదిలీ చేస్తున్నట్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖికంగా చెప్పడం సరికాదని వారు పేర్కొన్నారు. తాము వినకపోవడంతో హాజరు పట్టికను దాచి విధులకు హాజరుకాలేదని చెప్పడం తగదన్నారు. నిజాం కళాశాల ప్రన్సిపాల్​ నారాయణ మహిళా టీచర్లను ఫోన్లో వేధింపులకు గురిచేస్తున్నారని అందుకే తమ గోడును తెలంగాణ మానవ హక్కుల కమిషన్​ చైర్మన్​ జస్టిస్ చంద్రయ్యను కలిసి వెళ్లబోసుకున్నట్లు పేర్కొన్నారు. తమను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మానవహక్కుల కమిషన్ చైర్మన్ ను కలిసిన వారిలో కాంట్రాక్ట్ అధ్యాపకులు పరశురాం, ధర్మతేజ, ప్రియ, శ్రీనివాస్, సనత్​, ప్రేమయ్య, వినితాపాండే, పరేమేశ్వరి, బాలకోఠి, కిరణ్​, రవికుమార్​తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story