‘విరాటపర్వం’లో నివేద కీ రోల్

by Shyam |
‘విరాటపర్వం’లో నివేద కీ రోల్
X

దిశ, వెబ్‌డెస్క్: రానా దగ్గుబాటి, సాయి పల్లవిల రెవల్యూషనరీ లవ్ స్టోరి ‘విరాటపర్వం’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొవిడ్, రానా అనారోగ్యం కారణంగా ఆగిపోయిన సినిమా చిత్రీకరణ 10 రోజుల క్రితం మళ్లీ ప్రారంభమయింది. కొత్తగా బ్యూటీఫుల్ నివేదా పేతురాజ్ ఈ ప్రాజెక్ట్‌లో చేరింది.

కీలక పాత్రలో కనిపించబోతున్న భామ..హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో శుక్రవారం నుంచి జాయిన్ అయింది. దీంతో తనకు వెల్‌కమ్ చెప్తూ నిర్మాణ సంస్థలు ఎస్‌ఎల్‌వీ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్‌, డైరెక్టర్ వేణు ఊడుగుల ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వస్తున్న సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story