యంగ్ హీరోతో నిత్యామీనన్ బ్రంచ్

by Shyam |
యంగ్ హీరోతో నిత్యామీనన్ బ్రంచ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
పాత్రలో ప్రత్యేకత ఉందంటే.. అది చిన్న పాత్రయినా సరే, ఓకే చెప్పడమే కాదు.. దానికి 100 శాతం న్యాయం చేసే నటి నిత్యామీనన్. యూనిక్ కేరెక్టర్స్, నేచురల్ యాక్టింగ్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నిత్య.. ఇటీవలే ‘బ్రీత్ 2’ వెబ్‌సిరీస్‌‌లోనూ తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌తో నెటిజన్లను మెప్పించింది. ప్రస్తుతం శ్రియ‌ లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘గ‌మ‌నం’లో నిత్య క్లాసికల్ సింగర్‌గా నటిస్తోంది. కాగా, సంవత్సరం తర్వాత సండే రోజున హ్యాపీగా గడుపుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోను పంచుకుంది నిత్య.

‘దాదాపు ఓ సంవత్సరం తర్వాత.. సండే బ్రంచెస్. మేమిద్దరం కలిసి చేస్తున్న తొలి తెలుగు చిత్రం కోసం వెయిట్ చేయలేకపోతున్నాను’ అంటూ అశోక్ సెల్వన్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌లో కలిసి బ్రంచ్ చేస్తున్న ఫొటోలను పంచుకుంది. నిత్యామీనన్, అశోక్ సెల్వన్ నటిస్తున్న ఈ చిత్రానికి శశి దర్శకత్వం వహిస్తుండగా.. ‘నిన్నిలా నిన్నిలా’ అనే టైటిల్ అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ జరుపుకోలేదు. ఇందులో పెళ్లిచూపులు ఫేం రీతు వర్మ కూడా నటిస్తోంది. తమిళ హీరో అశోక్ సెల్వన్‌కు ఇదే తొలి తెలుగు సినిమా కాగా, తను ఇటీవలే రితికా సింగ్‌తో కలిసి చేసిన ‘ఓ మై కడవలే’ సినిమాతో హిట్ కొట్టాడు. ఈ చిత్రంలోని నటనకుగాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కూడా అందుకున్న ఈ యంగ్ హీరో.. ‘సూదుకవ్వం, విల్లా, తెగిడి, సమ్‌టైమ్స్’ వంటి చిత్రాల్లో నటించాడు.

https://www.instagram.com/p/CFoVTeYlM-3/

Advertisement

Next Story