- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీకే ఓటేసిన ‘నిశ్శబ్దం’ ?
లేడీ సూపర్‌స్టార్ అనుష్క శెట్టి నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా విడుదలపై త్వరలోనే మౌనం వీడనున్నారు దర్శక, నిర్మాతలు. లాక్‌డౌన్ తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించిన నిశ్శబ్దం విడుదల థియేటర్‌లోనే ఉంటుందని.. ఒకవేళ పరిస్థితులు సపోర్ట్ చేయకపోతే ఓటీటీలో విడుదల చేస్తామని ఇంతకుముందు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది వరకు కూడా థియేటర్లు ఓపెన్ అయ్యే చాన్స్ లేకపోవడంతో.. మూవీ యూనిట్ ఓటీటీకే ఓటేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఓటీటీలో రిలీజ్ కానున్న తొలి తెలుగు భారీ బడ్జెట్ మూవీ ఇదే కానుంది.
విజువల్ ఎఫెక్ట్స్ మినహా అన్ని పనులు పూర్తి చేసుకున్న నిశ్శబ్దం సినిమా ఫస్ట్ కాపీ త్వరలోనే వచ్చేస్తుందని సమాచారం. దాని తర్వాత ఓటీటీ ప్రతినిధులతో నిర్మాతలు చర్చలు జరుపుతారని.. నిర్మాతల డిమాండ్‌కు ఓకే చేసిన వాళ్లకే సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ఇస్తారని తెలుస్తోంది. హేమంత్ మధుకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించగా.. గిరీశ్ జి, గోపీ సుందర్ సంగీతం అందించారు.