- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోకల్ చానల్‌కు 'నిశ్శబ్దం' నోటీసులు..
దిశ, వెబ్ డెస్క్: స్వీట్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సూపర్ గుడ్ రివ్యూలు సొంతం చేసుకున్న చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. వారి నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించగా.. దర్శకుడు హేమంత్ మధుకర్ డైరెక్షన్ స్కిల్స్ అద్భుతమని కొనియాడారు. మంచి రివ్యూ రేటింగ్‌తో దూసుకుపోతున్న చిత్రం విడుదలైన రోజే లోకల్ చానల్స్‌ను హెచ్చరించింది మూవీ యూనిట్. తమ సినిమాను లోకల్ చానల్స్‌లో ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా సరే అలాంటి హెచ్చరికలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లోని ఓ లోకల్ చానల్ సినిమాను ప్రసారం చేస్తున్నట్లు యాడ్ కూడా వేసింది.
ఈ విషయం కాస్త నిర్మాతలకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి.. రూ. 1.1 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని నోటీసులు పంపించారు. ఈ సినిమా ప్రసార హక్కులు కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ కూడా రూ. 30 లక్షల నష్టపరిహారం కోరుతోంది. కాగా కోన వెంకట్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమాకు గిరీష్ జి, గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు.