అక్కా.. త్వరగా బిడ్డను కనెయ్ : నిషా అగర్వాల్

by Jakkula Samataha |
kajal agarwal
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ శనివారం 36వ సంవ్సతరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ తెలియజేయగా.. తన చెల్లెలు నిషా అగర్వాల్ ఓ స్పెషల్ విష్ రివీల్ చేయడం విశేషం. ‘సెల్ఫిష్ రీజన్స్’ కోసం కాజల్ త్వరగా ఒక బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నట్లు రీసెంట్ చాట్ సెషన్‌లో వెల్లడించింది. తనకు అక్టోబర్‌లో పెళైనప్పటి నుంచి ఇదే విషయం అడుగుతున్నానని చెప్పింది.

ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే.. కాజల్ కొడుకుతో తన కొడుకు ఆడుకునేందుకు వీలు పడదని, అందుకే తొందరగా బిడ్డను కనమని అక్కకు చెబుతున్నానని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. నిషా కొడుకు ఇప్పటికే 3 సంవత్సరాలు ఉండగా.. కాజల్ దంపతులు తొందరపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే, తన కొడుకుతో కాజల్‌కు ఉన్న అనుబంధాన్ని గురించి వివరించిన నిషా.. ఓ తల్లి కన్నా ఎక్కువగా, నాయనమ్మలా చూసుకుంటుందని చెప్పుకొచ్చింది. కాగా పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story