- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ అప్పులపై నిర్మలా సీతారామన్ అసహనం
దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ఏపీ ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో ఏపీ చేస్తున్న అప్పులపై వివాదం నడుస్తోంది. మరోవైపు బీజేపీ ఎంపీలు సైతం ఏపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తోందని నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. మద్యం ఆదాయంపై అప్పు చేయడంపై వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు, తద్వారా అప్పులు చేయడంపై వివరణ ఇచ్చారు. ఆర్థిక మంత్రి బుగ్గనతోపాటు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, ఆర్థికశాఖ అధికారులు ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకే అప్పులు తెచ్చుకోవాలని.. ఇప్పటికే పరిధి దాటి అప్పులు చేశారని సూచించినట్లు తెలుస్తోంది.