నో లాక్‌డౌన్.. స్థానిక నియంత్రణ.. నిర్మలా వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2021-04-14 00:18:46.0  )
నో లాక్‌డౌన్.. స్థానిక నియంత్రణ.. నిర్మలా వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కోరలు చాచుతున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధించగా.. లాక్‌డౌన్ దిశగా కూడా అడుగులు వేస్తున్నాయి. కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని, రాష్ట్రాలే కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తెలిపారు.

ఈ క్రమంలో దీనిపై మరోసారి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించమని, స్థానిక నియంత్రణ చేపడతామని పేర్కొన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, కరోనా నిబంధనలు లాంటి ఐదు స్తంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కరోనా రోగులను ఇళ్లలో క్వారంటైన్ చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed