అజ్ఞాతం వీడండి: నిర్మల్ డీఎస్పీ

by Aamani |
అజ్ఞాతం వీడండి: నిర్మల్ డీఎస్పీ
X

దిశ, ఖానాపూర్: అందరికీ దూరమై.. అనారోగ్యంతో బాధపడుతూ అవస్థలు పడేదాని కన్నా అజ్ఞాతం వీడి కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని మావోయిస్టులకు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాకు చెందిన అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న కంతి లింగవ్వ, ఎర్రి మోహన్ రెడ్డి, తూమ్ శ్రీను, గౌసు భాయి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మైలవరపు అడెల్లులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిస్తే అన్ని విధాలా ఆదుకుంటామని డీఎస్పీ అన్నారు.

లక్ష్మీపూర్ గ్రామంలోని కoతి లింగవ్వ కుటుంబ సభ్యులను సోమవారం డీఎస్పీ కలిశారు. కంతి లింగవ్వతో పాటు ఆమె భర్త అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని కుటుంబ సభ్యులు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి లొంగిపోతే మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని వారికి డీఎస్పీ సూచించారు.

గతంలో మారుమూల గ్రామాల్లో ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని అన్నారు. గతంలో లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎలాంటి అనుమానాలు లేకుండా సరెండర్ కావాలని ఆయన మావోయిస్టులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed