- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు చేయూతనివ్వండి : నిరంజన్ రెడ్డి
దిశ, న్యూస్ బ్యూరో: దేశంలో రైతు ఉత్పత్తి చేసినా పంట జాతీయ సంపద సృష్టికి తోడ్పాటవుతుందని, అందుకు కృషి చేస్తున్న రాష్ట్రానికి అదనపు నిధులు, సహకారం అందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలకు కేంద్ర సాయం ఉపయోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, కిసాన్ క్రెడిట్ కార్డుల ప్రగతి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక మార్కెట్‌లను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ల అనుసంధానానికి కోల్డ్‌స్టోరేజ్‌ల నిర్మాణం, ప్యాక్‌హౌజ్‌ల నిర్మాణం రాష్ట్రాంలో చేపడుతున్నామన్నారు. స్వరాష్ట్రంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం పూర్తయ్యిందని, మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోదాముల నిర్మాణానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని తెలిపారు.
కేసీఆర్ ముందు చూపుతో గత ఐదేళ్లుగా గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ 400 నుంచి 1000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి తోమర్‌కు వివరించారు. స్థలాల గుర్తింపు కోసం రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చామని, వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాల నియంత్రణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
వచ్చే నాలుగేళ్లలో వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధి అన్ని రాష్ట్రాలకు కలిపి వ్యవసాయ రంగానికి కేంద్రం లక్ష కోట్లు వడ్డీ రాయితీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం మంచిదేనని కానీ, దీనిని రాష్ట్రాలకు గ్రాంట్‌గా ఇస్తే బాగుండేదని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తి చేశామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, సాగునీటి రాకతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగి పంటల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందన్నారు. ఈ ఏడాది కేంద్రం దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం వరిధాన్యంలో 56 శాతం పైగా తెలంగాణ నుంచే సేకరించిందని గుర్తు చేశారు. ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.