‘ఒకరిద్దరి అత్యుత్సాహంతో వ్యవస్థకే చెడ్డపేరు’

by Shyam |   ( Updated:2020-04-02 09:22:11.0  )
‘ఒకరిద్దరి అత్యుత్సాహంతో వ్యవస్థకే చెడ్డపేరు’
X

దిశ, మహబూబ్ నగర్: వనపర్తిలో బుధవారం సాయంత్రం తండ్రీకొడుకులు వాహనంపై వెళ్తుండగా వారిపై పోలీసులు అమానవీయంగా దాడిచేయడాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. లాక్ డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు పోలీసుశాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇదే సమయంలో ఇలాంటి ఒకరిద్దరి అత్యుత్సాహం, దురుసుతనం మూలంగా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై విచారణ చేపట్టి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అపూర్వరావును ఆదేశించారు. పోలీసులు ప్రజలతో సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అయితే, వనపర్తి ఘటనలో వ్యక్తి పై దాడి చేసిన కానిస్టేబుల్ అశోక్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, దాడి ఘటనపై హోంమంత్రి, డీజీపీలు స్పందించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరిన విషయం తెలిసిందే.

tags: police attack, wanaparthy, niranjan reddy, kcr, home minister, dgp, sp apoorva rao

Advertisement

Next Story

Most Viewed