- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిలోఫర్‌లో మరోస్కామ్.. చిన్న పిల్లల ప్రోటీన్ ఫుడ్ స్వాహా..!
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో చిన్న పిల్లల వైద్యానికి పేరుగాంచిన నిలోఫర్ ఆస్పత్రిలో మరోస్కామ్ వెలుగులోకి వచ్చింది. పిల్లలకు అందించే ప్రోటీన్ ఫుడ్ ఇవ్వకుండానే గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు క్లెయిమ్ చేశాడో కాంట్రాక్టర్. తాజాగా నిలోఫర్ సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈస్కామ్ ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నిలోఫర్ డైట్ కాంట్రాక్ట్ సురేష్ బాబు పిల్లలకు అందించే నాణ్యమైన ఆహారానికి సంబంధించి దొంగ బిల్లులు సృష్టించాడు.
చిన్నారులకు ప్రోటీన్ ఫుడ్ అందించకుండానే ఇచ్చినట్లు అధికారులను తప్పుదారి పట్టించి సుమారు రూ.1కోటి20 లక్షలు దండుకున్నాడు. ఈ విషయం నిలోఫర్ సూపరింటెండెంట్ దృష్టికి రావడంతో ఆయన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నిందితుడు సురేష్ బాబును అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.