- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిఖిల్ పెళ్లి మళ్లీ వాయిదా
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కారణంగా యువ హీరో నిఖిల్ వివాహం మరోసారి వాయిదా పడింది. పల్లవి వర్మ అనే వైద్యురాలితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఏప్రిల్ 16న పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా వేసుకుని మే 14న పెళ్లి జరపాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడగించడంతో.. తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సారి పెళ్లి తేదీని మాత్రం నిఖిల్ ప్రకటించలేదు. ఇలా జరగడంపై ఆయన తీవ్ర నిరుత్సాహనికి గురయ్యారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘మొదట ఏప్రిల్ 16న వివాహం జరపించాలని మా కుటుంబ సభ్యులు నిర్ణయించారు. లాక్ డౌన్ కారణంగా అది మే 14 వ తేదీకి వాయిదా పడింది. ఇప్పడు మళ్లీ మే 17వరకు పొడగించారు. దీంతో నిరాశకు గురయ్యాను. కరోనాతో పోరాటం ముగిసే వరకు మా పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం. బయట చాలా మంది పడుతున్న బాధలతో పోలిస్తే.. నేను పడుతున్న బాధ పెద్దది కాదు. నా పెళ్లి జరిగే సమయంలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా సోకినా.. ఆ బాధ నన్ను జీవితం మొత్తం వేధిస్తోంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కాబట్టి అది చాలా వేడుకగా జరుపుకోవాలి. ఇలాంటి కష్టకాలంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. . కరోనా ముగిశాక మేము చాలా ఘనంగా పెళ్లి చేసుకుంటాం’ అని తెలిపారు.
tags: corona, lockdown, hero nikhil, pallavi varma, marriage