పోలీస్ కేసుపై క్లారిటీ ఇచ్చిన నిహారిక భర్త చైతన్య

by Shyam |
పోలీస్ కేసుపై క్లారిటీ ఇచ్చిన నిహారిక భర్త చైతన్య
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం హాట్‌టాపిక్‌గా మారింది. న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చైతన్యపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవపై చైతన్య క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశాడు. ముందుగా తానే అపార్ట్‌మెంట్ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ మీడియాలో తనపై మొదటగా కేసు నమోదైనట్లు వచ్చిందన్నాడు.

25 మంది వచ్చి తమ డోర్ బాదడంతో ఫిర్యాదు చేశానని, తాను అపార్ట్‌మెంట్ రెంటుకు తీసుకున్న పర్పస్ తమ ఓనర్ కు తెలియజేశానని, ఆ విషయం అపార్ట్‌మెంట్ వాసులకు క్లారిటీ లేకపోవడంతోనే గొడవ జరిగిందన్నాడు. ఇరు వర్గాలు మాట్లాడుకుని చర్చించుకున్నామని వీడియోలో పేర్కొన్నాడు. అయితే నిహారికతో కలిసి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఆఫీసు పెట్టాలని చైతన్య భావించగా.. అందుకే అపార్ట్‌మెంట్ వాసులు నిరాకరించారు. ఆఫీస్ పేరుతో చైతన్య ఫ్రెండ్స్ వచ్చి తాగుతూ రచ్చ చేస్తున్నారని అపార్ట్‌మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story