మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

by Shamantha N |
మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
X

ముంబయి: రాత్రుల్లో కర్ఫ్యూ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముంబయితోపాటుఅన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు జనసంచారంపై కఠిన ఆంక్షలు ఉంటాయని తెలిపింది. ఈ ఆంక్షలు వచ్చే ఏడాది జనవరి 7వరకు అమల్లో ఉండనున్నాయి. యూకేలో రూపాంతరం చెందిన కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు స్పష్టమవుతున్నది. రాత్రుల్లో కర్ఫ్యూ విధించాలని లేదని, కానీ, నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకున్నట్టు సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. వచ్చే ఆరేండ్ల వరకు ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed